ఆంటీతో రొమాన్స్ చేస్తున్న స్టార్ హీరో..!

95

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తాడు. అతను హీరోగా వెట్రిమారన్ డైరక్షన్ లో వచ్చిన పొల్లదవన్, ఆడుగళ, వడచెన్నై సినిమాలు సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో ప్రస్తుతం వస్తున్న సినిమా అసురన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను మెప్పించగా సినిమాలో ధనుష్ మధ్య వయస్కుడిగా కనిపిస్తాడట. ఇక సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీలో ధనుష్ కు జోడీగా మళయాళ స్టార్ హీరో దిలీప్ భార్య ఒకప్పటి హీరోయిన్ మంజు వారియర్ నటిస్తుందట.

దాదాపు 40 ఏళ్ల వయసు కలిగిన ఈ ఆంటీని హీరోయిన్ గా పెట్టారంటే ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ధనుష్ నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మంజు వారియర్ ఇప్పుడు మళయాళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. అయితే ఆమె లీడ్ రోల్ గా సినిమా అంటే అందరు షాక్ అవుతున్నారు. ధనుష్, మంజుల జోడీ సినిమాకు హైలెట్ గా ఉంటుందట.

మరి తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్న ధనుష్ అసురన్ తో కూడా తన ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని అంటున్నారు. ఈమధ్యనే మారి-2తో వచ్చి అలరించిన ధనుష్ అసురన్ తో ఎలాంటి హంగామా సృష్టిస్తాడో చూడాలి.

Leave a comment