వామ్మో అజిత్ ఆ సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..!

74

కోలివుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో ఒకరు అజిత్ కుమార్. తెలుగు లో పెళ్లిపుస్తకం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ సినిమా తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. అక్కడే ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. అజిత్ మూవీ రిలీజ్ అవుతుందటే చాలు అక్కడ ఫ్యాన్స్ పండుగ వాతావరం నెలకొంటుంది.

హీరోగా ఎంత సింపుల్ గా ఉంటారో..బయట కూడా అయన అంతే సింపుల్ గా ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి షాలిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. సాధారణంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు రూ.15 నుండి రూ.20 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. ఈ మద్య కొంత మంది హీరోలు మూవీ షేర్స్ లో వాటాలు తీసుకుంటున్నారు.

కానీ కోలీవుడ్ లో మాత్రం రేంజ్ కాస్త ఎక్కువే ఉంది.. రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ లాంటి హీరోలు ఒక్కో సినిమాకు రూ.40 నుండి రూ.50 కోట్ల వరకు తీసుకుంటారని కోలివుడ్ వర్గాల సమాచారం. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ‘నేర్ కొండ పార్వై’ అనే సినిమాలో నటించమని అజిత్ కి భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అ మూవీ కోసం అజిత్ ఏకంగా రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Leave a comment