హలో ట్రీజర్ చూస్తే చాలు… ధియేటర్ కి ఛలో

hello

అఖిల్‌ ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తన రెండో చిత్రం హలో షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. స్వయంగా నాగార్జున  దగ్గర ఉంది  మరీ అఖిల్‌ విషయంలో మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అఖిల్ హలో చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు , తాజాగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మొదటి సినిమాలో కన్నా సెకండ్ మూవీలో అఖిల్ ఇంకా స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. మనం తర్వాత అక్కినేని ఫ్యామిలీతో కలిసి చేస్తున్న విక్రం కుమార్ ఖచ్చితంగా  ఈ సినిమాతో కూడా తన సత్తా చాటుతాడు అనడంలో సందేహం లేదు.

ఈ చిత్రం చూస్తుంటే సెంటిమెంట్, లవ్, యాక్షన్ అన్నీ సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తుంది. అఖిల్ కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు..యాక్షన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి.

నాగ్ వాయిస్‌ ఓవర్‌తో ‘ ద లక్కియెస్ట్ పీపుల్ బార్న్ ఆన్ ది దిస్ ఎర్త్..వాళ్లు మాత్రం ఎవరేం చేసినా..ఏం అడ్డు వచ్చినా..తన సోల్ మేట్ ని కలుస్తారు. లైఫ్ ని షేర్ చేసుకుంటారని’ మొదలైని టీజర్ లో అఖిల్ చిన్ననాటి పాత్రలు కనిపిస్తున్నాయి.

అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనూప్‌ స్వరాలను అందిస్తున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అఖిల్ ఫీట్లు అక్కినేని అభిమానులనే కాదు సిని ప్రియులను అలరిస్తాయని తెలుస్తుంది. మరి అఖిల్ కోరుకునే అదిరిపోయే హిట్ ఈ హలో ఇస్తుందో లేదో చూడాలి. నాగార్జున అయితే ఈ సినిమా మీద గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.

 

Leave a comment