Gossipsతొలిరోజే హలోకి దెబ్బేశారు..హిట్ అయినా నష్టమే..!

తొలిరోజే హలోకి దెబ్బేశారు..హిట్ అయినా నష్టమే..!

అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా హలో. ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోస్ లో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తొలిరోజే అఖిల్ కు పెద్ద దెబ్బ తగిలిందని అంటున్నారు. ఈ సినిమాతో పాటే నాని ఎం.సి.ఏ సినిమా రిలీజ్ అయ్యింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా దిల్ రాజు బ్యానర్లో వచ్చింది. కాబట్టి తన ఓన్ థియేటర్స్ లోనే కాకుండా డిస్ట్రిబ్యూట్ చేసే థియేటర్స్ లో కూడా ఎం.సి.ఏ సినిమాను రిలీజ్ చేశారట.

ముఖ్యంగా కోస్తాలో తూర్పు, పశ్చిమ గోదావరి ఏరియాల్లో బి,సి సెంటర్స్ లో అంతా ఎం.సి.ఏ కే ప్రిఫరెన్స్ ఇచ్చారట. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ రెండు మూడు ఉండగా వాటిలో ఎం.సి.ఏ సినిమానే రిలీజ్ చేశారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ 35 కోట్లు కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల దాకా జరిగింది. ఈ సినిమా టాక్ బాగానే తెచ్చుకున్నా ఓవరగాల్ గా సినిమా హిట్ అనిపించుకోవాలంటే 50 కోట్లు వసూళు చేయాల్సిందే.

దిల్ రాజుతో పోటీగా వచ్చిన అఖిల్ హలో నాగార్జున స్వయంగా నిర్మించారు. అయితే నాని ఎం.సి.ఏ కు డివైడ్ టాక్ రావడంతో కచ్చితంగ అఖిల్ సినిమాకు థియేటర్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news