Gossipsరామ్ 'హలో గురు ప్రేమకోసమే' రివ్యూ & రేటింగ్

రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’ రివ్యూ & రేటింగ్

కథ :

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన సంజు (రామ్) తన మనసు గెలిచిన అను (అనుపమ పరమేశ్వరన్) కోసం వెతుకుతుంటాడు. అయితే అనుకోకుండా సంజు లైఫ్ లోకి ఓ మిడిల్ ఏజ్ ఫ్రెండ్ తారసపడతాడు. అనుతో అతని ప్రేమ గెలిచేలా తన సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. ఓ ఫ్రెండ్ గా సంజు, అనులను కలపడానికి కృషి చేస్తాడు ప్రకాశ్ రాజ్. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంతకీ ప్రకాశ్ రాజ్ ఎవరు..? అను ఎవరి కూతురు..? ఫైనల్ గా తండ్రి కూతుళ్లను ఒప్పించి సంజు తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎప్పటిలానే తన ఎనర్జీతో మెప్పించాడు. సినిమాలో అన్ని ఎమోషన్స్ ను బాగా చూపించాడు రామ్. ఇక సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె నటన కూడా మెప్పించింది. మరో హీరోయిన్ ప్రణీత కూడా ఉన్నంతలో బాగా చేసింది. సంజు పాత్ర తర్వాత ప్రకాశ్ రాజ్ పాత్ర సినిమాకు హైలెట్ అవుతుంది. రామ్, ప్రకాశ్ రాజ్ ల కాంబో సీన్స్ చాలా బాగున్నాయి. మహేష్, సితార, జయప్రకాశ్, సత్య, నరేష్, పోసాని వంటి వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చాలా అందంగా తెరకెక్కించడంలో కెమెరా మెన్ వర్క్ బాగుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. ఎక్కడో విన్న సాంగ్స్ లా ఆల్బం అనిపించడం జరుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రసన్న కుమార్ డైలాగ్స్ మెప్పిస్తాయి. నేను లోకల్ తర్వాత అతని పెన్నుకి మరింత పదును పెరిగిందని చెప్పొచ్చు. ఇక దర్శకుడు త్రినాథ రావు కథ, కథనాలు ఆద్యంతం వినోదాత్మకంగా సాగాయి. అయితే ఎలాంటి కొత్త పాయింట్ లేదు కాబట్టి ఆడియెన్స్ బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన హలో గురు ప్రేమ కోసమే సినిమా ట్రైలర్ చూస్తే సినిమా అర్ధమయినట్టే. హీరోయిన్ ను లవ్ లో పడేసేందుకు హీరో నానా కష్టాలు పడుతుంటాడు. ఇదే టైంలో తనకు ఓ మిడిల్ ఏజ్ ఫ్రెండ్ ఇచ్చే సలహాల మేరకు హీరో వాటిని ఫాలో అయ్యి హీరోయిన్ ను ఇంప్రెస్ చేస్తాడు.

కథ, కథనాలు రొటీన్ గా అనిపించినా ఎలాంటి బోర్ లేకుండా ఆసక్తిగా మలచడంలో దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు. కచ్చితంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా హలో గురు ప్రేమకోసమే సక్సెస్ సాధించినట్టే. స్క్రీన్ ప్లే ఇంకాస్త ట్రిం చేస్తే బాగుండేది. నేను లోకల్ తర్వాత త్రినాథ రావు చేసిన ఈ సినిమా అతనికి మంచి క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

రాం, అనుపమ పెయిర్

సినిమాటోగ్రఫీ

బిజిఎం

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

సెకండ్ హాఫ్ ల్యాగ్ అవడం

బాటం లైన్ :

హలో గురు ప్రేమ కోసమే.. పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 2.75/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news