Gossips" హలో గురు ప్రేమ కోసమే "ఆఫీషియల్ ట్రైలర్

” హలో గురు ప్రేమ కోసమే “ఆఫీషియల్ ట్రైలర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. రామ్ సరసన అనుపమ పరమేశ్వన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. రామ్, ప్రకాశ్ రాజ్ కామెడీతో పాటుగా అనుపమ పరమేశ్వరన్ తో లవ్ ట్రాక్ కూడా బాగుందనిపిస్తుంది.

ముఖ్యంగా సినిమా అంతా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. నేను లోకల్ హిట్ తర్వాత త్రినాథ రావు చేస్తున్న ఈ క్రేజీ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి హలో గురు ప్రేమ కోసమే సినిమా రామ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఉన్నది ఒకటే జిందగి తర్వాత రామ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news