‘హలో’ కలెక్షన్స్.. షాక్ లో నాగార్జున..

hello collections

మొదటి సినిమా అఖిల్ ఫెయిల్యూర్ అవడంతో ఈసారి భారీ ఎఫర్ట్ పెట్టి మరి మనం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రం చేతిలో అఖిల్ భవిష్యత్ పెట్టేశాడు నాగార్జున. స్టైలిష్ ఎంటర్టైనర్ గా రావడానికి హలోకి 40 కోట్ల దాకా ఖర్చు చేశారట. సినిమా టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ ను అలరించగా హలో మూవీ మాత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా టాక్ బాగున్నా సరే కలక్షన్స్ విషయంలో మాత్రం ఆ సందడి కనిపించట్లేదు.

నిర్మాత నాగార్జున కొన్ని ఏరియాల్లో స్వయంగా సినిమా రిలీజ్ చేయగా.. మిగతా ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా ఇప్పటి వరకు 16.70 కోట్లను మాత్రమే రాబట్టిందట. ఏదైతే క్రిస్ మస్, న్యూ ఇయర్ హాలీడేస్ టార్గెట్ చేసి రిలీజ్ చేశారో ఆ రోజుల్లో కూడా హలో క్యాష్ చేసుకోలేకపోయింది. మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి సినిమాల హడావిడి మొదలవుతుంది.

మొత్తానికి అఖిల్ హలో ప్రీ రిలీజ్ హంగామానే తప్ప సినిమా మాత్రం మళ్లీ నాగార్జునకు నిరాశ మిగిల్చిందని చెప్పొచ్చు. అఖిల్ ఫ్లాప్ ఫైనాన్షియల్ గా తనకేం సంబంధం లేకున్నా హలో సినిమా స్వయంగా నాగార్జున సగానికి పైగా అంటే 15 కోట్ల దాకా లాస్ వచ్చేలా చేసిందని అంటున్నారు. మరి అఖిల్ కెరియర్ పై నాగార్జున తర్వాత నిర్ణయం ఏంటో వేచిచూడాలి.

Leave a comment