Movies" హ్యాపీ వెడ్డింగ్ " థియేట్రికల్ ట్రైలర్

” హ్యాపీ వెడ్డింగ్ ” థియేట్రికల్ ట్రైలర్

సుమంత్ అశ్విన్, కొణిదెల నిహారిక జంటగా నటించిన తాజా చిత్రం “హ్యాపీ వెడ్డింగ్ “. కొద్దీ రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేయగా దానికి నెటిజన్స్ మరియు సినీ అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. రెండు రోజుల క్రితం నిహారిక ఒక మీడియా విలేకరి పై ఫైర్ అయ్యే ప్రమోషనల్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ రోజు హీరో సుమంత్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేసింది. ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక చక్కటి కుటుంబ విలువలున్న ప్రేమ కథ చిత్రం అని తెలుస్తుంది.

‘హాపీ వెడ్డింగ్’ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా, శక్తి కాంత్ స్వరాలూ అందించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఆగష్టు లో విడుదలే చేసే ఆలోచనలో ఉన్నట్టు చిత్ర బృందం తెలిపింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news