Newsఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన బొద్దుగుమ్మ.. రివర్స్ లో క్లాస్ పీకిన...

ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన బొద్దుగుమ్మ.. రివర్స్ లో క్లాస్ పీకిన అభిమానులు!!

Hansika Motwani Warns her fans about her fake accounts which are not run by her. The fans are worried about the fake accounts on Hansika’s name.

హన్సిక మోత్వాని.. దేశముదురు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చి కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుక్కూర్చుంది ఈ బొద్దుగుమ్మ. ఇప్పుడు ఈ అమ్మడు గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. పాపం హన్సికకు టాలీవుడ్‌లో ఒకప్పటి ఫాలోయింగ్ లేకపోవడంతో, కోలీవుడ్ చెక్కేసింది ఈ బ్యూటీ. అక్కడ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న హన్సిక, వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. అయితే ఓ విషయంలో మాత్రం తన ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇస్తోంది ఈ బొద్దుగుమ్మ. ఇంతకీ ఏ విషయంలో ఆమె తన ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిందో తెలుసా.. తన సోషల్ మీడియా అకౌంట్ గురించి. అవును.. హన్సిక మోత్వాని తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఎవరో తనపేరుపై నడుపుతున్నట్లు తెలియజేస్తుంది.

తన అభిమానులు ఈ అకౌంట్‌ను ఫాలో కావద్దని.. ఇందులో వచ్చే పోస్ట్‌లు తాను పెట్టేవి కావంటూ వాపోతుంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె అకౌంట్‌లో ఏమైనా అశ్లీల వ్యవహారం నడుస్తుందా అంటే.. అది కూడా లేదు. మరి ఏమీ లేని దానికి ఇంత హడావిడి ఎందుకమ్మా అంటూ అడుగుతున్నారు ఆమె ఫ్యాన్స్. తమకు ఏది అఫీషియల్ అకౌంటో, ఏది కాదో తమకు బాగా తెలుసని ఆమెకు రివర్స్ క్లాస్ పీకడంతో.. పాపం హన్సిక ఏం చేయాలో తెలీక తెల్ల మొహం వేసుకుందట. మరి ఈ సమస్యను హన్సిక ఎలా పిరష్కరించుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news