అడివి శేష్ ‘గూఢచారి’ రివ్యూ & రేటింగ్

8

మల్టీ టాలెంటెడ్ గా అడివి శేష్ తన ప్రతిభ చాటేలా గూఢచారిగా వచ్చాడు. శషి కిరణ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించింది అడివి శేష్ అని తెలిసిందే. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

రా ఏజెంట్ గా పనిచేసే గొపి (అడివి శేష్) తండ్రి ఓ మిషన్ లో భాగంగా చనిపోతాడు. అయినా సరే గోపి అలియాస్ అర్జున్ నేషన్ సెక్యురిటీలో చేరుతాడు. సెక్యురిటీ ఏజెన్సీలో స్థానం సంపాదించేందుకు చాలా కష్టపడి. త్రినేత్రా అని ఓ సీక్రెట్ ఆర్గనైజేషన్ లో చేరతాడు అర్జున్. అయితే శత్రువులు ఈ మిషన్ ద్వారా దేశానికి నష్టం చేయాలని చూస్తారు. దాన్ని గోపి అలియాస్ అర్జున్ అడ్డుకుంటాడు. వారి నుండి దేశాన్ని ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో అడివి శేష్ అదరగొట్టాడు. రా ఏజెంట్ గా బాగా కష్టపడ్డాడు. కేవలం నటన పరంగానే కాదు కథ, స్క్రీన్ ప్లే విషయంలో అడివి శేష్ మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శోభిత కథలో భాగమే. ఆమె బాగానే చేసింది. సుప్రియ అలరించింది. ప్రకాశ్ రాజ్ పాత్ర సపోర్టింగ్ గా ఉంది. మిగతా వారంతా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

ఈ సినిమా టెక్నికల్ టీం చాలా ఎఫర్ట్ పెట్టారు. సినిమా బడ్జెట్ తక్కువే అయినా దన్ని అన్నివిధాలుగా వాడుకున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ చరణ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేసింది. కథ, కథనాల్లో అడివి శేష్ పర్ఫెక్ట్ అనిపించగా దర్శకుడు శషి కిరణ్ తన ప్రతిభ చాటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

రా ఏజెంట్.. స్పై థ్రిల్లర్ కథలు తెలుగులో ఇదవరకు వచ్చాయి. అయితే అడివి శేష్ గూఢచారి పర్ఫెక్ట్ స్పై థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సినిమా మొదటి నుండి గ్రిప్పింగ్ తో రాసుకున్నారు. కథ, కథనాలు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేస్తాయి. మొదటి భాగం క్యూరియాసిటీతో సాగగా సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తారు.

నేషనాలిటీ ప్రధాన అంశంగా సాగడం.. హీరో క్యారక్టరైజేషన్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాలో సపోర్టింగ్ రోల్ గా చేసిన ప్రకాశ్ రాజ్ పాత్ర తక్కువే అయినా బలమైందని చెప్పొచ్చు. సినిమా కోసమ అడివి శేష్ పడిన కష్టం అంతా తెర మీద కనబడుతుంది. డిఫరెంట్ సినిమాలు చూసే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్ :

అడివి శేష్

స్క్రీన్ ప్లే

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ లాజిక్ లేకపోవడం

బాటం లైన్ :

అడివి శేష్ నిజెమైన ‘గూఢచారి’..!

రేటింగ్ : 3/5

Leave a comment