గూఢచారి 3 డేస్ కలక్షన్స్.. బయ్యర్ల పరిస్థితి ఏంటి.?

18

అడివి శేష్ హీరోగా శషి కిరణ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గూఢచారి. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఏమాత్రం అంచనాలు లేని ఈ సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేయగా ట్రైలర్ మరింత సంబ్రమాశ్చర్యాలతో వచ్చింది. ఇక ఈ సినిమా వీకెండ్ కలక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3డేస్ లో 3.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

యూఎస్ లో మూడు రోజుల్లో 3,10,000 డాలర్స్ వసూళు చేసింది గూఢచారి. అక్కడ 117 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు 53,000 డాలర్స్, రెండో రోజు 1,50,000. మూడవ రోజు 1,51,000 డాలర్స్ వసూళ్లను రాబట్టింది. సరైన కంటెంట్ ఉంటే హీరో ఎవరన్నది చూడరని సినిమా నచ్చితే ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేస్తారని మరోసారి ఈ గూఢచారి సినిమాతో ప్రూవ్ అయ్యింది.

6 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా వీకెండ్ లో మూడున్నర రాబట్టగా ఇక ఈ వారం బాగానే కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చూస్తుంటే గూఢచారి దర్శక నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టేలా కనబడుతుంది.

Leave a comment