Gossipsబాల‌య్య టైటిల్ కొట్టేసిన గోపీచంద్‌..

బాల‌య్య టైటిల్ కొట్టేసిన గోపీచంద్‌..

మాస్ సినిమాలు అంటూ మూస ధోర‌ణితో సినిమాలు చేస్తోన్న యాక్ష‌న్ హీరో గోపీచంద్‌కు కొన్ని సంవ‌త్స‌రాలుగా హిట్ లేదు. గోపీ ఒకే ఒక్క హిట్ కోసం మొఖం వాచిపోయి ఉన్నాడు. ప్ర‌స్తుతం అనిల్ సుంక‌ర నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం షూటింగ్లో గాయ‌ప‌డ్డ గోపీ తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక ఈ సినిమా టైటిల్ గురించి చాలా రోజులుగా ర‌క‌ర‌కాల పుకార్లు వినిపించాయి.

ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ టైటిల్‌ను ఎట్ట‌కేల‌కు ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచిన బంగారు బుల్లోడు టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టిన‌ట్టు స‌మాచారం. ఎప్పుడో 1990వ ద‌శ‌కంలో బాల‌య్య హీరోగా ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్‌.

బాల‌య్య స‌ర‌స‌న ర‌వీనాటాండ‌ర్‌, ర‌మ్య‌కృష్ణ హీరోయిన్లుగా న‌టించారు. ఇప్పుడు గోపీచంద్ సినిమాకు ఈ టైటిల్ ఎంపిక చేసుకోవ‌డం వెన‌క కథకు ఎంతో దగ్గరగా ఉండడ‌మే కార‌ణ‌మ‌ట‌. బంగారం లాంటి మ‌న‌సు ఉన్న కుర్రాడు త‌న ప్రేమ‌ను గెలుచుకునేందుకు ఎలాంటి సాహ‌సాలు, త్యాగాలు చేశాడు ? అన్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ట‌.

మ‌రి బాల‌య్య‌కు సూప‌ర్ హిట్ ఇచ్చిన బంగారు బుల్లోడు టైటిల్ గోపీకి హిట్ ఇచ్చి మ‌నోడి కెరీర్ ట‌ర్న్ చేస్తుందేమో ? చూడాలి. గోపీ ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి తదుపరి సంపత్ నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించే సినిమా.. అలానే భవ్య క్రియేషన్స్ సినిమా కూడా చేయ‌నున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news