Gossipsగోపిచంద్ తో రిస్క్ చేస్తున్న ఆ నిర్మాత..!

గోపిచంద్ తో రిస్క్ చేస్తున్న ఆ నిర్మాత..!

మాన్లీ స్టార్ గోపిచంద్ కెరియర్ లో చాలా వెనుకపడ్డాడు. తనకున్న మాస్ ఇమేజ్ తో కొన్నాళ్లు పర్వాలేదు అనిపించిన గోపిచంద్ ఈమధ్య వరుస ఫ్లాపులు ఫేజ్ చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా గోపిచంద్ తిరు డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 30 కోట్ల దాకా పెడుతున్నారట. ప్రస్తుతం అసలు ఏమాత్రం మార్కెట్ లేని గోపిచంద్ సినిమాకు 30 కోట్ల బడ్జెట్ ఏంటని షాక్ అవుతున్నారు ట్రేడ్ పండితులు.

అయితే కరెక్ట్ సినిమా పడితే గోపిచంద్ సత్తా ఏంటో తెలుస్తుంది. తిరు సినిమాతో అదే ప్రూవ్ అవుతుందని అంటున్నారు చిత్రయూనిట్. గౌతం నంద, ఆక్సిజన్ సినిమాలు గోపిచంద్ ను వెనక్కి నెట్టేశాయి. తిరు డైరక్షన్ లో గోపిచంద్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నాడని తెలుస్తుంది. కథ కూడా బాగా రావడంతో అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు.

కమర్షియల్ సినిమా అయితే అనుకున్న ఫిగర్ కు ఇంకా అటు ఇటు పెట్టాల్సి వస్తుంది. అంతేకాదు సినిమా పూర్తయినా సినిమా బిజినెస్ కూడా ఆ రేంజ్ లో అవడం కష్టమే.. మొత్తానికి గోపిచంద్ సినిమా పట్టాలెక్కనుంది. మరి ఈ సినిమాతో అయినా గోపిచంద్ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news