గూఢచారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్‌లో హయ్యెస్ట్!

40

క్షణం సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన అడివి శేష్ తాజాగా గూఢచారి సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్నుండి మంచి అంచనాలు ఏర్పడగా రిలీజ్ తరువాత వాటిని అందుకోవడంలో సినిమా సక్సెస్ అయ్యింది. అదిరిపోయే కంటెంట్‌తో అడివి శేష్ మరోసారి ప్రేక్షకులను మెప్పించగలిగాడు.

దీంతో ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు వస్తున్నాయి. మరోవైపు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చి|ల|సౌ| చిత్రం కూడా ఈ సినిమాకు పోటీగా విడుదల కాగా గూఢచారి చిత్రానికే జనాలు ఓట్లు వేశారు. ఈ చిత్రం మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.6.90 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. అడివి శేష్ కెరీర్‌లో 5 కోట్లు దాటిన మొదటి చిత్రం ఇదే. ఇప్పటికే చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలోకి వచ్చేశారు. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఏరియాలవారీగా ఈ చిత్ర మొదటి వారం కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 2.20
సీడెడ్ – 0.40
ఉత్తరాంధ్ర – 0.56
గుంటూరు – 0.31
ఈస్ట్ – 0.35
వెస్ట్ – 0.20
కృష్ణా – 0.46
నెల్లూరు – 0.12
టోటల్ ఏపీ+తెలంగాణ – 4.60 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.50
ఓవర్సీస్ – 1.80
టోటల్ వరల్డ్‌వైడ్ – 6.90 కోట్లు

Leave a comment