Gossipsఎన్టీఆర్ అభిమానులకి అదిరిపోయే న్యూస్... మే నెలలో పండగే !!

ఎన్టీఆర్ అభిమానులకి అదిరిపోయే న్యూస్… మే నెలలో పండగే !!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇంట మరో వ్యక్తి రాబోతున్నారు. తారక్, ప్రణతిలకు మరో సంతానం అందబోతుందట. ఈ విషయం ఎన్.టి.ఆర్ సన్నిహితుల నుండి బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రణతి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అయితే ఈ విషయం గురించి ఎన్.టి.ఆర్ అఫిషియల్ గా త్వరలో ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. ప్రణతి డెలివరీ మే నెలలో ఉంటుందని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్, ప్రణతిలకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. అభయ్ రాం వచ్చాక ఎన్.టి.ఆర్ కెరియర్ లో కొత్త ఉంత్సాహం వచ్చింది. వరుసగా విజయాలను అందుకుంటున్నాడు తారక్. అభయ్ రాం తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు ఈ జంట. ఇక సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రం తో సినిమాకు సిద్ధమవుతున్న తారక్ ఫిజిక్ మార్చుకునే పనిలో ఉన్నాడట.

కొత్త లుక్ లో త్రివిక్రం సినిమాలో దర్శనమిస్తాడని అంటున్నారు. మొత్తానికి తారక్ పర్సనల్ లైఫ్ లో మరో కొత్త టర్న్ తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ ఆనందంతో మునిగితేలుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news