Moviesప్రముఖ సీనియర్ నటులు గిరీశ్ కర్నాడ్ ఇకలేరు..!

ప్రముఖ సీనియర్ నటులు గిరీశ్ కర్నాడ్ ఇకలేరు..!

ప్రముఖ దక్షిణాది నటుడు గిరీశ్ కర్నాడ్ (81) ఈ ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. మహారాష్ట్రలోని మాతేరన్ లో 1938 మే 19న జన్మించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్ మృతి చెందారన్న వార్త తెలియడంలో చిత్ర పరిశ్రమ తీవ్ర షాక్ కు గురయ్యింది. రంగస్థల నటులుగా విశేష ప్రాచుర్యం పొందిన గిరీష్ కర్నాడ్ నాటకరంగంలో చెరిగిపోని ముద్ర వేశారు.

కేవలం నటుడిగానే కాకుండా రచయితగా , దర్శకుడిగా అటు రంగస్థలంలో ఇటు వెండితెరపై కూడా రాణించాడు. 81 ఏళ్ల వయసులో మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యాడు . ఈరోజు ఆరోగ్యం మరింతగా విషమించడంతో ఉదయం 6. 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. పలు తెలుగు సినిమాల్లో ఆయన విలక్షణ పాత్రలు పోషించారు.

ఆనందభైరవి, శంకర్ దాదా ఎంబీబీఎస్, ధర్మచక్రం, రక్షకుడు, ప్రేమికుడు వంటి పలు చిత్రాల్లో నటించారు. 1998లో గిరీష్ కర్నాడ్.. జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు. వంశవృక్షం అనే కన్నడ సినిమాకు గాను ఆయన ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.

కన్నడ, హిందీ, తెలుగు చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు. 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. గిరీష్ కర్నాడ్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయిందన్నారు. అన్ని చిత్ర పరిశ్రమలు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news