Gossipsబాహుబలి రికార్డును బద్దలు కొట్టిన గీత గోవిందం !

బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన గీత గోవిందం !

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా గీతా గోవిందం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా వసూళ్లను చూస్తుంటే స్టార్ హీరోలకు షివరింగ్ వస్తుందని చెప్పొచ్చు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించిన ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేశారు.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ చేసిన ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. సినిమాలో విజయ్ గోవింద్ గా అలరించాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా కలక్షన్స్ బాహుబలి రికార్డులను చెరిపేసేలా ఉన్నాయి. టోటల్ కలక్షన్స్ లో కాకుండా ఏరియాల వారిగా బాహుబలి రికార్డులను బీట్ చేసే ఊపు చూపిస్తుంది గీతా గోవిందం.

చెన్నై సిటీలో మొదటి రోజు 1.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన గీతా గోవిందం అక్కడ కూడా హౌజ్ ఫుల్ షోస్ తో రేసుగుర్రంలా దూసుకెళ్తుంది. ఈ వీకెండ్ కల్లా 3 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. చూస్తుంటే చెన్నైలో తెలుగు వర్షన్ బాహుబలి సినిమా వసూళ్లను మించి గీతా గోవిందం వసూళ్లను రాబడుతుంది. బాహుబలి రికార్డులను అది కూడా అప్కమింగ్ హీరో బ్రేక్ చేయడం అంటే మాములు విషయం కాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news