గీత గోవిందం లిప్ లాక్ సీన్లు హల్ చల్ .. అర్జున్ రెడ్డి ఏమాత్రం మారలేదు.. పాపం రష్మిక(వీడియో)

43

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. గీఆ ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. పేరుకి బన్ని వాసు అయినా సినిమా నిర్మాణమంతా అల్లు అరవింద్ పర్యవేక్షణలోనే జరిగింది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే గుంటూరులో స్టూడెంట్స్ దగ్గర మూవీ ప్రింట్ అందరిని షాక్ అయ్యేలా చేసింది. మూవీ ఎడిటింగ్ కు సంబందించిన వారి నుండి ఇది ఈ లీక్ అయ్యిందని తెలిసింది.

అయితే ఈ లీక్స్ నిజంగానే జరిగాయా లేక పబ్లిసిటీ స్టంటా అన్నది డౌట్ పడుతున్నారు. ముఖ్యంగా ఈ లీకైన సీన్స్ లో విజయ్, రష్మికల లిప్ లాక్స్ సీన్స్ ఉండటం ఈ డౌట్స్ రేజ్ అయ్యేలా చేస్తుంది. గీతా గోవిందం లీకేజ్ పై చిత్రయూనిట్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నెత్తి నోరు మొత్తుకున్నారు.

ఎప్పుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా కనిపించే విజయ్ దేవరకొండ మొదటిసారి చమర్చిన కళ్లతో ఎమోషనల్ గా మాట్లాడినట్టు అనిపించింది. ఇక అల్లు అరవింద్ అయితే విజయ్ ఫ్యాన్స్ ఈ లీకేజ్ కు కారకులైన వారిని తంతారంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు 10-15 ఏళ్లలో విజయ్ స్టార్ క్రేజ్ ముందు తట్టుకోవడం కష్టమే అని వార్నింగ్ ఇచ్చాడు. చూస్తుంటే అల్లు అరవింద్ కు విజయ్ టాలెంట్ పూర్తిగా అర్ధమైనట్టు ఉంది. సినిమా రిలీజ్ కు ముందే ఈ లిప్ లాక్ సీన్స్ యూత్ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి.

Leave a comment