రష్మిక జీవితం నాశనం చేసిన విజయ్ దేవరకొండ..!

54

కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న రష్మిక ఆ క్రేజ్ తో తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ తో విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో విజయ్, రష్మిక రొమాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సినిమా లోని కొన్ని సీన్స్ ఈమధ్య లీక్ అవగా అందులో విజయ్, రష్మికల లిప్ లాక్ సీన్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. అర్జున్ రెడ్డిలోనే అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉందని అనిపించగా ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా ప్రమోట్ చేస్తున్నారు. కాని ఇందులో కూడా విజయ్ లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.

ఇక విజయ్ రష్మికల లిప్ లాక్స్ కన్నడలో రష్మిక ఫ్యాన్స్ ను హర్ట్ అయ్యేలా చేసింది. అక్కడ ఫ్యాన్స్ రష్మిక మీద నెగటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. అవకాశాలను బట్టి హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ లో కూడా నటించాల్సి ఉంటుంది. అందులో భాగంగా రష్మిక విజయ్ తో రొమాన్స్ కన్నడ ప్రేక్షకులకు నచ్చినట్టు లేదు. అయితే దీనికి ఓ కారణం కూడా ఉంది కన్నడ దర్శకుడు రోహిత్ శెట్టితో రష్మిక పెళ్లికి రెడీ అవుతుంది. ఇలాంటి టైంలో రష్మిక ఇలా ముద్దులాట ఆడటం అక్కడి ఫ్యాన్స్ ను నిరాశపరచింది. మరి ఈ ట్రోలింగ్స్ కు రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a comment