Gossips" గీతా గోవిందం " ప్రీ - రివ్యూ

” గీతా గోవిందం ” ప్రీ – రివ్యూ

ఎవడో సుబ్రమణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ వెంటనే వచ్చిన అర్జున్ రెడ్డి అతని రేంజ్ ఏంటో చూపించింది. యూత్ తో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ రేపు గీత గోవిందం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతుందని తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో విజయ్ హీరోయిన్ రష్మిక చుట్టూ మేడం మేడం అని పడటం సినిమాపై ఆసక్తి పెంచుతుంది. సినిమాలో విజయ్ చేసిన ఓ చిన్న తప్పు వల్ల హీరో, హీరోయిన్ దూరవుతారు. ఈ క్రమంలో హీరోయిన్ ను ఇంప్రెస్ చేసే క్రమంలో హీరో ఏం చేశాడు అన్నదే గీతా గోవిందం కథ.

ఆంజనేయులు నుండి శ్రీరస్తు శుభమస్తు వరకు దర్శకుడిగా పంథా కొనసాగిస్తున్న పరశురాం గీతా గోవిందం సినిమాను విజయ్ అభిమానులు అలరించేలా తెరకెక్కించాడని ప్రమోస్ చూస్తే అర్ధమవుతుంది.

ఛలో తర్వాత రష్మిక నటించిన ఈ సినిమా ఆమె పరంగా కూడా క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాలో విజయ్ రౌడీ గ్యాంగ్ సాటిస్ఫై అయ్యేలా లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ వాల్యూ.. మెలోడీ మ్యూజిక్ ఇవన్ని ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. మరి ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ అవుతున్న ఈ గీతా గోవిందం విజయ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

https://youtu.be/8awV4WFBzXk

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news