” గాయత్రి ” రివ్యూ & రేటింగ్

gayatri-review-and-rating

మదన్ డైరక్షన్ లో కలక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ చేస్తూ తెరకెక్కిన సినిమా గాయత్రి. మోహన్ బాబుతో పాటుగా మంచు విష్ణు, శ్రీయ, నిఖిలా విమల్ నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఈరోజు ప్రేక్షకుల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉంతో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

స్టేజ్ ఆర్టిస్ట్ అయిన దాసరి శివాజి (మోహన్ బాబు) శారదా సదన్ అనే అనాధాశ్రమాన్ని నడుపుతుంటాడు. మరో పక్క డబ్బు కోసం మారు వేషంలో కోర్ట్ లో శిక్ష పడిన వారి స్థానంలో వెళ్తుంటాడు. శివాజి, శారదాల కూతురు గాయత్రి చిన్నప్పుడే తప్పిపోతుంది. ఎన్నాళ్ల నుండో వెతుకుతున్న ఆమె సడెన్ గా ఓ రోజు ఆమె ఎక్క్డ ఉందో తెలియగా.. కూతురిని కలుసుకునేందుకు శివాజి ఉత్సాహంగా ఉంటాడు. కట్ చేస్తే గాయత్రి పటేల్ (మోహన్ బాబు) శివాజిని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ శివాజిని గాయత్రి పటేల్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు..? అసలు ఎవరీ గాయత్రి పటేల్..? శివాజికి, తనకు ఉన్న సంబంధం ఏంటన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

శివాజి, గాయత్రి పటేల్ రెండు పాత్రల్లో మోహన్ బాబు మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా గాయత్రి పటేల్ పాత్రలో తన మార్క్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఇక సినిమాలో యంగ్ ఏజ్ లో ఉన్న శివాజిగా మంచు విష్ణు నటించాడు. పాత్ర కొద్దిసేపే అయినా న్యాయం చేశాడు. శ్రీయ పాత్ర కూడా నిడివి తక్కువే అయినా ఆకట్టుకుంది. గాయత్రిగా నిఖిలా విమల్, శ్రేష్టగా అనసూయ ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సర్వేష్ మురారి కెమెరా వర్క్ బాగుంది. తమన్ పాటలు బాగున్నాయి. రెండు పాటలు మెప్పించాయి. బి.జి.ఎం కూడా ఆకట్టుకుంది. మదన్ కథ, కథనాలు కొత్తగా ఉన్నాయి. మోహన్ బాబు పాత్ర డెవలప్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. డైమండ్ రత్నం మాటలు బాగా పేలాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

చిన్నప్పుడే కూతురు కనిపించకుండా పోయిన ఓ తండ్రి.. ఇక ఎన్నాళ్ల నుండో తనలో ఉన్న పగని అవకాశం రాగానే తీర్చుకోవాలనుకునే ఓ వ్యక్తి కథే గాయత్రి. కథగా అనుకున్న పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. అయితే కథనం కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. మంచి పాయింట్ కు తల్లి కూతుళ్ల సెంటిమెంట్ అద్దాడు డైరక్టర్.

మొదటి భాగం అంతా కథ కాస్త అటు ఇటుగానే సాగుతుంది. గాయత్రి పటేల్ పాత్ర ఎంటర్ అయినప్పుడే సినిమా వేరే లెవల్ కు వెళ్తుంది. సినిమాలో గాయత్రి పటేల్ పాత్ర ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్ ఓకే.. క్లైమాక్స్ 40 నిమిషాలు బాగా రక్తికట్టించారు. కలక్షన్ కింగ్ మరోసారి తన నటనతో ఇంప్రెస్ చేశాడు.

తనకు సైన కథతో గాయత్రిగా మోహన్ బాబు మెప్పించాడనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ కు సినిమా బాగా నచ్చుతుంది. మోహన్ బాబు అభిమానులకు సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. డైలాగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అది సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.

ప్లస్ పాయింట్స్ :

మోహన్ బాబు

సెకండ్ హాఫ్

టేకింగ్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ ల్యాగ్ అవడం

మిస్సింగ్ ఎంటర్టైన్ మెంట్

బాటం లైన్ :

గాయత్రి మోహన్ బాబు నట విశ్వరూపం..!

రేటింగ్ : 2.5/5

Leave a comment