Moviesబాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రెండు రోజుల కలెక్షన్స్!!

బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రెండు రోజుల కలెక్షన్స్!!

Balayya’s prestigious project Gautamiputra Satakarni second days collections report of telugu states is out. Area wise report has given below.

బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబడుతోంది. తొలిరోజు ఆయన కెరీర్‌లోనే రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. రెండోరోజు కూడా చెప్పుకోదగిన కలెక్షన్లే సాధించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తొలిరోజు (గురువారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.9.82 కోట్లు (షేర్) కొల్లగొట్టిన శాతకర్ణి, రెండరోజు రూ. 3.69 కోట్లు వసూలు చేసింది. అంటే.. మొత్తం రెండురోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుంచి రూ.13.51 కోట్లు కొల్లగొట్టింది. దశాబ్దకాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన చిరు సినిమా పోటీగా ఉన్నప్పటికీ.. రెండోరోజు ఆ రేంజ్ వసూలు రావడం విశేషమని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన రెండురోజుల కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)…

నైజాం : 2.29
సీడెడ్ : 2.77
నెల్లూరు : 0.77
కృష్ణా : 1.06
గుంటూరు : 2.14
వైజాగ్ : 1.50
ఈస్ట్ గోదావరి : 1.25
వెస్ట్ గోదావరి : 1.73
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 13.51 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news