Moviesమరో సంచలన రికార్డ్ సృష్టించిన ‘శాతకర్ణి’.. తెలుగు ట్రైలర్లలో ఇదే మొదటిది!

మరో సంచలన రికార్డ్ సృష్టించిన ‘శాతకర్ణి’.. తెలుగు ట్రైలర్లలో ఇదే మొదటిది!

Gautamiputra Satakarni trailer has created one more record on youtube. It crossed 4 million views in just 75 hours of span which is record in Tollywood. This trailer increases the craze of film.

బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచి ఊహించని రికార్డులు సృష్టిస్తోంది. కేవలం నాలుగున్నర గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సంపాదించిన ఈ ట్రైలర్.. ఆ తర్వాత 2, 3 మిలియన్ల మార్క్స్‌ని తక్కువ టైంలోనే క్రాస్ చేసి పడేసింది. ఇప్పుడు మరో మైలురాయిని ఈ ట్రైలర్ అందుకుంది. కేవలం 75 గంటల్లోపే 4 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టుకుంది. అంత తక్కువ టైంలో అన్ని ఎక్కువ వ్యూస్ రాబట్టిన తొలి తెలుగు ట్రైలర్ ఇదే. అంతేకాదు.. 70 వేలకుపైగా లైక్స్ రాబట్టుకుని, ఆ విషయంలోనూ ఇదే టాప్‌లో ఉంది.

క్రీ.పూ.1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా రూపొందుతుండడంతో దీనిపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొనడం, అతి తక్కువ టైంలోనీ షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ట్రైలర్‌ని కళ్ళుచెదిరే గ్రాఫిక్స్‌తోపాటు వార్ సీన్లు అదిరిపోవడంతో.. దీనికి దేశవ్యాప్తంగా ఈ రేంజులో రెస్పాన్స్ వస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండడాన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే 5 మిలియన్ల మార్క్‌ని క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి.. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు దర్శకుడు క్రిష్.

కాగా.. ఈ మూవీ ఆడియో వేడుక ఈ నెల 26వ తేదీన గ్రాండ్‌గా నిర్వహించేందుకు యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం విస్తృతస్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news