గౌతమిపుత్రుడి క్లోజింగ్ కలెక్షన్లు.. మంచి లాభాలు పంచిన శాతకర్ణి !!

gautamiputra satakarni closing collections

నందమూరి బాలకృష్ణ శతచిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఈ సంక్రాతి కి విడుదలై అన్ని చోట్ల మంచి పాజిటివ్ టాక్ తో బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళని రాబట్టింది. తెలుగువాడి ఖ్యాతి అంటూ క్రిష్ ఎక్కు పెట్టిన నందమూరి బాణం సినిమా కొన్నవాళ్లందరికి మంచి లాభాలే పంచిపెట్టింది. అంతేకాక ఇప్పటివరకు అమెరికాలో 1 మిలియన్ డాలర్లు కూడా దాటని బాలయ్య ఈ చిత్రంతో 2 మిలియన్ కి దగ్గరగా రావడం విశేషం. ఒక వైపు చిరంజీవి ఖైదీ సినిమా పోటీని తట్టుకొని విభిన్న కథాంశంతో తెరకెక్కిన శాతకర్ణి 50 కోట్ల మార్కు దాటడం చాలా గొప్ప విషయం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పిన శాతకర్ణి ఫైనల్ కలెక్షన్ల వివరాలు(అంచనా) ట్రేడ్ వర్గాల ప్రకారం క్రింది విధంగా ఉన్నాయి.

నైజాం: రూ. 10.15 కోట్లు
సీడెడ్: రూ. 8 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 5.2 కోట్లు
గుంటూరు: రూ. 4.2 కోట్లు
కృష్ణా: రూ. 3.15 కోట్లు
తూర్పు గోదావరి: రూ. 3.5 కోట్లు
వెస్ట్: రూ. 3.5 కోట్లు
నెల్లూరు: రూ. 1.8 కోట్లు
కర్నాటక: రూ. 4.25 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ. 1 కోటి.
అమెరికా కలెక్షన్స్ రూ. 7 కోట్లు.
ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్ లో గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ 52.75 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

Leave a comment