Movies‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 6 రోజుల (ఏపీ+నైజాం) కలెక్షన్స్ వివరాలు..

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 6 రోజుల (ఏపీ+నైజాం) కలెక్షన్స్ వివరాలు..

Gautamiputra Satakarni 6 days collections of Telugu states report is out.

ఫస్ట్ వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా.. వీక్ డేస్‌లలో కూడా ఊహించిన దానికంటే మంచి వసూళ్లే రాబడుతోంది. సోమ, మంగళవారాల్లో ఈ సినిమా సంతృప్తికరమైన కలెక్షన్లే కలెక్ట్ చేసింది. దీంతో.. డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని 6 రోజుల్లో రూ. 32.05 కోట్లు (షేర్) కలెక్ట్ చేసింది. ఇంత తక్కువ టైంలో అంతమొత్తం కలెక్ట్ చేయడం బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్. ఇక కర్ణాటక, ఓవర్సీస్ వసూళ్లు కూడా కలుపుకుంటే.. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.43 కోట్ల (షేర్)కుపైగానే రాబట్టిందని ట్రేడ్ లెక్కలు పేర్కొంటున్నాయి.

ఏరియాల వారీగా 6 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 8.29
సీడెడ్ : 6.60
వైజాగ్ : 3.72
గుంటూరు : 3.55
వెస్ట్ గోదావరి : 2.95
ఈస్ట్ గోదావరి : 2.91
కృష్ణా : 2.49
నెల్లూరు : 1.51
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 32.02 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news