Movies‘శాతకర్ణి’ 5 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ పాసైన బాలయ్య

‘శాతకర్ణి’ 5 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ పాసైన బాలయ్య

Gautamiputra Satakarni first monday collections of telugu states report is out and it’s shocking. This film has earned very well in the working day also.

ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతోందంటే.. హీరో క్రేజ్, దానిపై ఉన్న అంచనాల్ని బట్టి ఆ చిత్రాన్ని చూసేందుకు జనాలు థియేటర్ల మీద ఎగబడతారు. పైగా.. వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా వస్తాయి. అంతవరకు బాగానే ఉంటుంది కానీ.. అసలైన పరీక్ష మాత్రం సోమవారంనాడే ఉంటుంది. ఆరోజు కూడా మంచి వసూళ్లు సాధిస్తే.. ఆ సినిమా జనాల్లోకి వెళ్లిపోయిందని, దాన్ని బాగానే ఆదరిస్తున్నారనే అంచనాకి వచ్చేయొచ్చు. అంటే.. ఆ సినిమా హిట్ అని అవగాహనకి వచ్చేయొచ్చు. అలాకాకుండా అంతంత మాత్రమే వసూళ్లు కలెక్ట్ చేస్తే.. ఆ సినిమా గల్లంతే.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘శాతకర్ణి’కి రిలీజ్ రోజు పాజిటివ్ టాక్ రావడం వల్ల.. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లో కనకవర్షం బాగానే కురిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.25.93 కోట్లు కొల్లగొట్టింది. అయితే.. సోమవారం ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందా? అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. వీకెండ్‌లో ప్రకంపనలు సృష్టించిన బాలయ్య.. మండే టెస్ట్ పాస్ అవుతాడా? అనే ఆతృత ఏర్పడింది. చివరికి ఆ రిజల్ట్ వచ్చేసంది. బాలయ్య మండే టెస్ట్ కూడా పాసై.. తన సత్తా ఏంటో చూపించాడు. వీకెండ్‌కి తగినట్లుగానే భారీ వసూళ్లు రాబట్టి.. ఔరా అనిపించాడు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం సోమవారంనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.4.88 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో.. మొత్తం 5 రోజుల్లో ఈ సినిమా ఏపీ, తెలంగాణాల నుంచే రూ. 30.81 కోట్లు కొల్లగొట్టింది. పాజిటివ్ రిపోర్ట్స్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఖైదీ, శతమానం భవతి సినిమాల పోటీమధ్య కూడా ‘శాతకర్ణి’ వర్కింగ్ డే నాడు అంతమొత్తం కలెక్ట్ చేయడం నిజంగా విశేషమని అంటున్నారు. దీన్ని బట్టి.. ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఏ రేంజులో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఏరియాల వారీగా 5 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 6.78
సీడెడ్ : 6.38
ఉత్తరాంధ్ర : 5.10
గుంటూరు : 3.41
వెస్ట్ గోదావరి : 2.66
ఈస్ట్ గోదావరి : 2.51
కృష్ణా : 2.30
నెల్లూరు : 1.67
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 30.81 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news