బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 13 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ వివరాలు

satakarni 13 days worldwide collections

Balayya’s 100th film Gautamiputra Satakarni 13 days worldwide collections report is out. According to trade, this film earning very well in week days also.

సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇంకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ చారిత్రాత్మక చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం వల్ల.. దాదాపు అన్ని ఏరియాల్లో సంతృప్తికరమైన వసూళ్లే రాబడుతోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.58.89 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.41.60 కోట్లు కొల్లగొట్టడం విశేషం.

గతంలో ఏ చిత్రం సాధించని వసూళ్లు కలెక్ట్ చేస్తూ.. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన చిత్రంగా ‘శాతకర్ణి’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఏ అంచనాలతో అయితే ఈ హిస్టారికల్ మూవీ రిలీజ్ అయ్యిందో.. వాటిని అందుకోవడంలో సక్సెస్ కావడం వల్లే ఇలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోందని.. అది కూడా ‘ఖైదీ’, ‘శతమానం భవతి’ చిత్రాలకు ధీటుగా పోటీనిస్తూ భారీ వసూళ్లు కలెక్ట్ చేయడం చెప్పుకోదగిన విషయమేనని అంటున్నారు.

ఏరియాల వారీగా 13 రోజుల కలెక్షన్ల వివరాలు (కోట్లలో) :
నైజాం : 11.20
సీడెడ్ : 7.70
ఉత్తరాంధ్ర : 5.20
ఈస్ట్ గోదావరి : 3.62
వెస్ట్ గోదావరి : 3.90
కృష్ణా : 3.40
గుంటూరు : 4.39
నెల్లూరు : 2.19
ఏపీ+తెలంగాణ : రూ. 41.60 కోట్లు
యూఎస్ఏ : 11
కర్ణాటక : 4.62
రెస్టాఫ్ ఇండియా : 1.67
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 58.89 కోట్లు

Leave a comment