Movies యూట్యూబ్ రికార్డు బద్దలు కొట్టిన శాతకర్ణి.. టాప్ ప్లేసులో బాలయ్య!!

యూట్యూబ్ రికార్డు బద్దలు కొట్టిన శాతకర్ణి.. టాప్ ప్లేసులో బాలయ్య!!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదల అయిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గరనుంచి.. కళ్యాణ్ రామ్, రాజమౌళి.. రామ్ గోపాల్ వర్మ మొదలుకొని టాలీవుడ్ యావత్తు ఆ ట్రైలర్ కి ఫిదా అయ్యి ప్రశంసల జల్లు కురిపించారు. 2 నిమిషాల ట్రైలర్ లోనే బాలయ్య డైలాగులు.. క్రిష్ టేకింగ్ ఔరా అనిపించాయి. 1 మిలియన్ వ్యూస్ ని కేవలం 4 గంటల లోపులోనే సాధించి ‘అతి తక్కువ సమయంలో 1 మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమా ట్రైలర్’గా రికార్డు సాధించింది. ఈ రికార్డు తో బాలయ్య తన క్రేజ్ ఏ స్థాయి లో ఉన్నదో మరోసారి రుచి చూపించాడు.

సంక్రాంతి బరిలో దిగనున్న ఈ నందమూరి నటసింహం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఇంకా ఎన్ని సంచనాలకు తెర తీస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 టీజర్ ‘తక్కువ సమయంలో 1 మిలియన్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమా టీజర్’గా రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు సీనియర్ హీరోలు ఇలా ఒకరి రికార్డులు మరొకరు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతుంటే సంక్రాంతి కి… తెలుగు సినిమాకి మరింత క్రాంతి వస్తుందనటంలో సందేహం లేదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ మరోసారి మీకోసం…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news