10 మంది పిచ్చోళ్ల ఓ మంచి ప్రయత్నం.. జగ్గూభాయ్ గ్యాంగ్ స్టార్స్..!

gang-stars-trailer

అజయ్ భుయాన్ డైరక్షన్ లో జగపతి బాబు, నవదీప్, సిద్ధార్థ్, శివాజి, శ్వేతబసు ప్రసాద్, అపూర్వ అరోరా కలిసి చేస్తున్న వెబ్ సీరీస్ గ్యాంగ్ స్టార్స్. సినిమాలో కలర్ ఫుల్ స్టార్స్ అంతా కలిసి చేస్తున్న ఈ వెబ్ సీరీస్ ను అమేజాన్ ప్రైమ్ ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. సినిమాకు ఏమాత్రం తక్కువకాని ఈ వెబ్ సీరీస్ కు క్రియేటివ్ హెడ్ గా ఉన్నారు డైరక్టర్ నందిని రెడ్డి.

10 మంది పిచ్చోళ్ల ఓ మంచి ప్రయత్నమే ఈ గ్యాంగ్ స్టార్స్. వెస్ట్రెన్ కల్చర్ అలవరచుకున్న మన తెలుగు క్రియేటర్స్ కేవలం తమ టాలెంట్ ను సినిమాల ద్వారానే కాదు ఇలా వెబ్ సీరీస్ ల రూపంలో కూడా ప్రదర్శించవచ్చని ప్రూవ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాకు ఏమాత్రం తక్కువ కాదని అనిపించడం సహజం.

ఇక ఇందులో జగపతి బాబు విలన్ గా కనిపిస్తున్నాడు. నవదీప్ హీరో, సిద్దార్థ్ డైరక్టర్, శివాజి పోలీస్, శ్వేత బసు ప్రసాద్ హీరోయిన్, అపూర్వ అరోరా నిర్మాతగా మారాలనుకుంటున్న ఓ యంగ్ లేడీగా కనిపిస్తున్నారు. మరి టీజర్, ట్రైలర్ సినిమాటిక్ లుక్ ఏర్పరచుకున్న ఈ గ్యాంగ్ స్టార్స్ వెబ్ సీరీస్ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. త్వరలో అమేజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండే ఈ వెబ్ సీరీస్ చూసేందుకు అమేజాన్ ప్రైమ్ లో మెంబర్ షిప్ ఉన్నవారికి మాత్రమే ఈ వెబ్ సీరీస్ చూసే ఛాన్స్ ఉంటుంది.

Leave a comment