జగపతి బాబు,నవదీప్, శ్వేతాబసు ల గ్యాంగ్ స్టర్స్ టీజర్.. టాలీవుడ్ నయా గ్యాంగ్..!(వీడియో)

gangsters-teaser

సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు కూడా ఎక్కువవుతున్న ఈ టైంలో స్టార్స్ సైతం షార్ట్ ఫిలింస్, వెబ్ సీరీస్ ల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెబ్ సీరీస్ లు క్లిక్ అయితే వాటికి తగినంత ఎమౌంట్ వస్తున్నాయి. లేటెస్ట్ గా అమేజాన్ ప్రైం ఎక్స్ క్లూజివ్ గా ఓ వెబ్ సీరీస్ స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లో క్రేజీ స్టార్స్ అంతా ఇందులో నటిస్తుండటం విశేషం.

గ్యాంగ్ స్టర్స్ అంటూ రాబోతున్న ఈ వెబ్ సీరీస్ లో నవదీప్, జగపతి బాబు, పోసాని, శివాజి, శ్వేతా బసు ప్రసాద్ ఇలా అందరు ఈ గ్యాంగ్ స్టర్స్ వెబ్ సీరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా సినిమాల్లో విలన్ గా బాగా బిజీగా ఉన్న జగపతి బాబు మొదటిసారి వెబ్ సీరీస్ చేయడం విశేషం. నేనే రాజు నేనే మంత్రి సినిమాకు మూల కథ అందించిన లక్ష్మి భూపాల్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారట. నందిని రెడ్డి పర్యవేక్షణలో అజయ్ భుయాన్ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. చాలా రోజుల తర్వాత శ్వేత బసు ప్రసాద్ ఈ వెబ్ సీరీస్ లో దర్శనమివ్వడం విశేషం. టీజర్ ఓ సినిమా అప్పీల్ కలిగిస్తున్నా గ్యాంగ్ స్టర్స్ వెబ్ సీరీస్ ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.

Leave a comment