Gossipsగ్యాంగ్ లీడర్ సీక్వెల్ లో హీరో ఎవరో తెలుసా ..?

గ్యాంగ్ లీడర్ సీక్వెల్ లో హీరో ఎవరో తెలుసా ..?

మెగా స్టార్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ లో ఏ సినిమా వచ్చినా అది సూపర్ డూపర్ హిట్టు అవ్వాల్సిందే. అంత పవర్ ఉంది మరి మెగా స్టార్ కి. ఆయన కెరియర్లో అన్ని మంచి సినిమాలే వచ్చినప్పటికీ ఎవర్ గ్రీన్ గా మిగిలిపోయిన సీనిమాలు కొన్ని సినిమాల్లో గ్యాంగ్ లీడర్. ఈ సినిమాలో చిరంజీవి నటన చూస్తే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే !

తాజాగా మళ్ళీ ఈ సినిమా గురించి ఓ వార్త ఫిలిం నగర్ లో చెక్కెర్లు కొడుతోంది. అదే ఆ సినిమా సీక్వెల్ ను మెగా హీరోలలో ఒకరు చేయబోతున్నారన్న వార్త ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అయితే ఆ సినిమాను తాను చేయడం లేదని, ఆ సినిమా చరణ్ చేయవలసిందని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చేశాడు.

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆ సినిమాలో నటిస్తాడని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అందులోనూ, చైతూ సినిమాల్లో చిరు పాటల రీమిక్స్ లు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో, మేనమామ`పోలికలున్న తేజూ నే గ్యాంగ్ లీడర్ అవుతాడని అందరూ భావించారు. తాను గ్యాంగ్ లీడర్ కాదని సాయి ధరమ్ కూడా తాజాగా క్లారిటీ ఇచ్చేశాడు. ‘జవాన్’ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం తేజూ బిజీ బిజీగా ఉన్నాడు.

అభిమానులతో ఫేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొన్న తేజూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా గ్యాంగ్ లీడర్’ సీక్వెల్లో చేస్తారా? అంటూ ఓ అభిమాని తేజూని అడిగాడు. ” ‘గ్యాంగ్ లీడర్’ సీక్వెల్ చేస్తే చరణ్ చేయాలి ఆయన చేస్తేనే ఆ సినిమాకి న్యాయం జరుగుతుందని సమాధానం చెప్పాడు. రామ్ చరణే గ్యాంగ్ లీడర్ సీక్వెల్ తీస్తాడనే క్లారిటీ అయితే అందరికి వచ్చేసింది. సో త్వరలోనే చెర్రీ మరో గ్యాంగ్ లీడర్ కాబోతున్నాడన్నమాట !

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news