వారి మధ్య సంభాషణలు ఏంటో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..!

Funny conversation between ntr and pavan

ఎన్టీఆర్ త్రివిక్రమ్  సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. అర్ధగంటకు పైగా ఈ ఈవెంట్లో  ఉండి చాలా ఉల్లాసంగా గడిపారు పవన్. ఎన్టీఆర్, పవన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడటం.. ఇద్దరూ చాలా ఆత్మీయంగా, సరదాగా గడపడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఇద్దరూ పేల్చిన పంచులు అందరినీ నవ్వించాయి.

పూజా కార్యక్రమం ముగిశాక పవన్ సినిమాలో తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. ఆ సందర్భంగా పవన్ త్రివిక్రమ్‌ను ఉద్దేశించి.. ‘‘నాకివన్నీ భయం సార్. చేతులు వణుకుతున్నాయి. క్లాప్ కొడుతూ ఏం చెప్పాలి’’ అని అడిగాడు. దీంతో తారక్ సహా అందరూ గొల్లున నవ్వారు. తర్వాత త్రివిక్రమ్ అందుకుని.. ‘‘తారక్ దండం పెట్టుకుంటాడు. ఆయన కెమెరా స్విచాన్ చేస్తాడు’’ అని చెబుతుంటే.. పవన్ ‘‘నేను దాక్కోవాలా” అని పంచ్ వేశాడు. మళ్లీ నవ్వులు పూశాయి.

పవన్ క్లాప్ కొట్టగానే తారక్ దండం పెట్టుకోవాల్సి వచ్చినపుడు.. ఎటువైపు తిరిగి దండం పెట్టాలంటూ అందరినీ నవ్వించాడు. ఆపై పవన్ క్లాప్ కొట్టాక ఏం చేయాలో తెలియక అలాగే నవ్వుతూ కింద కూర్చుండిపోయాడు. తారక్ దేవుడికి దండం పెట్టి వెనక్కి తిరిగి చూస్తే పవన్ కూర్చుని ఉండేసరికి గొల్లున నవ్వాడు.

ఓపెనింగ్ షాట్ ముగిసిన తర్వాత గ్రూప్ ఫోటో తీస్తున్నారు, అయితే పవన్ ని అందరు సెంటర్ లో నిలబడమంటే, పవన్ మాత్రం తారక్ ని మధ్యలో ఉండమని చెప్పారు . ఇలా మొత్తంగా ఈ ఈవెంట్ చాలా సరదాగా సాగిందిట.

Leave a comment