రష్మీపై మెగాఫ్యాన్స్ బూతుల దాడి.. లబోదిబోమన్న యాంకరమ్మ

fight between rashmi gautam and mega fans on twitter

One person posted on twitter by comparing Guntur Talkies and Dhruva collections in which he mentioned Rashmi is better than Ram Charan. By watching this post mega fans got angry on Rashmi and make controversial comments on her.

తమ అభిమాన హీరోల గురించి ఒక్క మాట చెబితే చాలు.. బ్రహ్మాండం బద్దలయ్యేలా ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలమవుతారు. అవతల వ్యక్తి ఎవరన్నది పట్టించుకోకుండా.. దాడి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పరచుకుని తారాస్థాయిలో విమర్శలు చేస్తారు. కొందరైతే బూతులు కూడా తిట్టేస్తారు. విచిత్రం ఏమిటంటే.. A అనే ఒక హీరో B అనే మరొక కథానాయకుడిపై కామెంట్ చేశాడని C అనే వేరెవ్వరో వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. దానిపై క్లారిటీ తీసుకోకుండానే ఫ్యాన్స్ అందరూ C వ్యక్తిని పక్కనపెట్టేసి A హీరోపై విమర్శల దాడి చేస్తారు. ఇలాగే యాంకర్ రష్మీ గౌతమ్ విషయంలోనూ జరిగింది.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ని ‘గుంటూర్ టాకీస్’ మూవీ కలెక్షన్లతో పోలుస్తూ ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో.. విజయవాడలో ‘గుంటూరు టాకీస్’ తొలిరోజు రూ.17 లక్షలు కలెక్ట్ చేసిందని.. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన‘ధృవ’ కేవలం రూ.14 లక్షలే వసూలు చేసిందని పేర్కొన్నాడు. అంటే.. చరణ్ కంటే యాంకర్ రష్మీ గౌతమే బెటరని అభిప్రాయం వ్యక్తం చేస్తూ సదరు వ్యక్తి ఆ పోస్ట్ పెట్టాడు. అంతే.. ఇది చూసిన మెగాఫ్యాన్స్ ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తిని పక్కనపెట్టేసి, రష్మీ గౌతమ్ మీద దండయాత్ర చేశారు. ఆమె పేరుని ట్యాగ్ చేసి బూతులు తిట్టేస్తూ.. దారుణమైన కామెంట్లు చేశారు. అంతేకాదు.. ఆమె క్యాస్ట్ గురించి కూడా ప్రస్తావించారు. ఇలా తనపై తండోపతండాలుగా వస్తున్న కామెంట్స్ చూసి హర్ట్ అయిన రష్మీ.. వాటికి గట్టి జవాబే ఇచ్చింది.

జోకుల్ని జోకుల్లా తీసుకోకుండా ఇలా బూతులు తిట్టడం ఏంటని రష్మీ వాపోయింది. తన కులం గురించి కామెంట్లు చేసిన వాళ్లను ఉద్దేశించి.. మనం ఏ కాలంలో ఉన్నాం అని ప్రశ్నించింది. తనను తిట్టి పోసిన కొందరితో వన్ టు వన్ ఫైట్‌కు దిగింది. ఇలా మెగాఫ్యాన్స్, రష్మీ మధ్య కాసేపు వాడీవేడీగా వాగ్వాదం జరిగింది. చివరికి ఓ మెగాఫ్యాన్ జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. మెగా అభిమానుల తరఫున సారీ చెప్పి.. ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకోమన్నాడు. దీంతో.. అటు రష్మీ, ఇటు మెగాఫ్యాన్స్ కూల్ అయిపోయారు.

Leave a comment