Gossips" F2 " ఆఫీషియల్ టీజర్.. సంక్రాంతికి వస్తున్న కామెడీ...

” F2 ” ఆఫీషియల్ టీజర్.. సంక్రాంతికి వస్తున్న కామెడీ అల్లుళ్లు..

వెంకటేష్ వరుణ్ క్రేజీ కాంబినేషన్ లో కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమై అవుతున్న f2 సినిమా ట్రీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలయ్యింది. ట్రీజర్ లో భార్య బాదితుడిగా వెంకటేష్ డిఫ్రెంట్ డిఫ్రెంట్ ఎక్స్ప్రెషన్స్ లో కామెడీ పండించాడు. ఇక మరో హీరో వరుణ్ ని పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ … తాను ఇప్పటికే పడుతున్న బాధను అతనికి తెలిసేలా వెంకటేష్ చెప్పినా … వరుణ్ పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తనకు తెలుసు అన్నట్టుగా చెప్పడం … మధ్యలో రఘబాబు కూడా పెళ్ళాం బాధితుడి అన్నట్టుగా ఈ ట్రీజర్ లో చూపించారు. ఎవరు ఎన్ని చెప్పినా.. వరుణ్ వినకుండా పెళ్లి చేసుకోవడం … ఆ తరువాత భార్యతో బాధలు పడడం వెంకీ – వరుణ్ ఒకరిని ఒకరు ఓదార్చే క్రమంలో పండించే కామెడీ అందరిని ఆకట్టుకుంటోంది.

వెంకీ మళ్ళీ ఫ్యామిలీ కామెడీ పండించడానికి గత సినిమాల ట్రాక్ రికార్డు బద్దలుకొట్టేందుకు సిద్ధం అవుతున్నట్టుగా ఈ సినిమా ట్రీజర్ చూస్తుంటే కనిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా… వరుణ్ సరసన మొహరీన్ జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావిపూడి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news