c

సంక్రాంతి అళ్లుల్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్, వరుణ్ తేజ్‌లు తమ జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి బరిలో మిగతా సినిమాలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. వెంకీ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇప్పటికే బొమ్మ బ్లాక్‌బస్టర్‌గా మారి వెంకీ కెరీర్‌లో మరో హిట్ సినిమాగా ఎఫ్2 నిలిచింది. అటు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఈ సినిమా మంచి హిట్ సినిమాగా నిలిచింది. అటు ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 2మిలియన్ డాలర్లు వసూళు చేసి కామెడీ జోనర్ సత్తా చాటుతోంది. కాగా ఈ చిత్రం 12 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియ – 12 రోజుల కలెక్షన్లు
నైజాం – 17.31 కోట్లు
సీడెడ్ – 6.52 కోట్లు
ఉత్తరాంధ్ర – 7.69 కోట్లు
గుంటూరు – 4.24 కోట్లు
తూర్పు గోదావరి – 5.77 కోట్లు
పశ్చిమ గోదావరి – 3.28 కోట్లు
కృష్ణా – 4.17 కోట్లు
నెల్లూరు – 1.54 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 50.52 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news