Gossipsఎఫ్-2 11 రోజుల కలక్షన్స్.. పెద్ద సినిమాలకు ఇక చుక్కలే..?

ఎఫ్-2 11 రోజుల కలక్షన్స్.. పెద్ద సినిమాలకు ఇక చుక్కలే..?

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ సినిమ సంక్రాంతి బరిలో వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. పోటీగా వచ్చిన సినిమాలన్ని నిరాశపరచాగా ఎఫ్-2 వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. కేవలం 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఎఫ్-2 60.92 కోట్లు రాబట్టింది.

ఈ సినిమాకు ఈ రేంజ్ కలక్షన్స్ అసలు ఊహించని దిల్ రాజు కేవలం థియేట్రికల్ రన్ లోనే ఇన్ని లాభాలు తెచ్చుకుంటే ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఇంకెన్ని కోట్లు తెస్తాయో అంచనా వేయొచ్చు. ఎలా లేదన్నా దిల్ రాజుకి చాలా రోజుల తర్వాత అదిరిపోయే ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ ఎఫ్-2 అని చెప్పొచ్చు. ఇక ఏరియాల వారిగా ఎఫ్-2 11 రోజుల కలక్షన్స్ వివరాలు చూస్తే..

నైజాం : 16.79 కోట్లు

సీడెడ్ : 6.35 కోట్లు

ఉత్తరాంధ్ర : 7.38 కోట్లు

ఈస్ట్ : 5.65 కోట్లు

వెస్ట్: 3.20 కోట్లు

కృష్ణా : 4.09 కోట్లు

గుంటూరు : 4.17 కోట్లు

నెల్లూరు : 1.54 కోట్లు

ఏపి/తెలంగాణ : 49.17 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 3.80 కోట్లు

ఓవర్సీస్ : 7.95 కోట్లు

వరల్డ్ వైడ్ : 60.92 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news