Movies‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ 16 రోజుల కలెక్షన్స్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ 16 రోజుల కలెక్షన్స్

Young hero Nikhil Siddhartha’s latest romantic horror thriller drama “Ekkadiki Pothavu Chinnavada” is doing very well at the worldwide boxoffice even in note ban effect. According to the trade reports, this movie has earned 10.27 Cr shares from both Telugu States and approx Rs 14.3 Crore shares at the Worldwide box office in it’s 16 days run. It is written and directed by Vi Anand and produced by PV Rao under Meganana Arts banner. In this film Avika Gor, Heebah Patel and Nandita Swetha played the female lead.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంచనాలకు తగ్గట్టుగానే ప్రభంజనం సృష్టిస్తోంది. కరెన్సీ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కుదిపేస్తుంటే.. ఈ చిన్నోడు మాత్రం బాక్సాఫీస్‌ని కుమ్మేస్తున్నాడు. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ డ్రామా అయిన ఈ చిత్రం ఆడియెన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడంతో దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కర్ణాటక, యూఎస్ఏలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల్లో రూ.14.3 కోట్ల షేర్ (రూ.25 కోట్లు గ్రాస్) రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం రూ.10.27 షేర్ రాబట్టడం విశేషం. ఇప్పటికీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడం, చాలా ఏరియాల్లో డీసెంట్ వసూళ్లు వస్తుండడంతో.. టోటల్ రన్‌టైంలో రూ.20 కోట్లు షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ సరసన హెబ్బా పటేల్, నందితా శ్వేత, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. కమెడియన్‌గా నటించిన

ఏరియాల వారీగా 16 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 4.1
సీడెడ్ : 1.4
ఉత్తరాంధ్ర : 1.22
ఈస్ట్ గోదావరి : 0.84
వెస్ట్ గోదావరి : 0.65
గుంటూరు : 0.90
కృష్ణా : 0.82
నెల్లూరు : 0.34
ఏపీ+తెలంగాణ : రూ. 10.27 కోట్లు (షేర్)
కర్ణాటక : 1.23
యూఎస్ఏ : 2.5
రెస్ట్ : 0.30
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 14.3 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news