ఎన్టీఆర్ గురించి ఈషా రెబ్బ సంచలన వ్యాఖ్యలు.!

ntr-isha-rebba

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కు ఛాన్సులు నామ మాత్రమే అన్నది ఓపెన్ టాక్. ఇక్కడ వారికి అవకాశం వచ్చినా ఎందుకో క్లిక్ అవలేదు. అయితే ఈమధ్య కాలంలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ప్రయత్నించిన వారిలో ఈషా రెబ్బ ఒకరు. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన ఈషా రెబ్బ అమీ తుమీ.. అ ఆ సినిమాల్లో నటించింది.

నటిగా మంచి గుర్తింపు తెచుకుంటున్న ఈషా కెరియర్ పరంగా మాత్రం అంత క్రేజ్ దక్కించుకోలేదు. అయితే ఈసారి మాత్రం లక్కీ ఛాన్స్ అందుకుంది. త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా చేస్తున్న అరవింద సమేత సినిమాలో అమ్మడు సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. ఆ సినిమాలో తనని చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెబుతుంది ఈషా. అంతేకాదు తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటుంది.

ఇక సెట్స్ లో ఎన్.టి.ఆర్ ఎనర్జీ గురించి కూడా తన మాటల్లో చెబుతుంది ఈషా. ఎన్.టి.ఆర్ ఎనర్జీ సూపర్ అని.. కరెంట్ పాస్ అయ్యే లైవ్ వైర్ అని పొగడ్తలతో ముంచెత్తుతుంది ఈషా. సెట్స్ లో ఎన్.టి.ఆర్ చాలా ఫన్నీగా ఉంటారని.. సరదాగా జోకులేస్తుంటారు. షూటింగ్ అంతా చాలా ప్రశాంతంగా సాగుతుందని అంటుంది ఈషా.

Leave a comment