Moviesఈ నగరానికి ఏమైంది ట్రైలర్.. పెళ్లిచూపులు దర్శకుడు మరో క్రేజీ అటెంప్ట్..!

ఈ నగరానికి ఏమైంది ట్రైలర్.. పెళ్లిచూపులు దర్శకుడు మరో క్రేజీ అటెంప్ట్..!

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న తరుణ్ భాస్కర్ తన సెకండ్ మూవీ ఈనగరానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా అంతా కొత్తవాళ్లతో తీశాడు తరుణ్ భాస్కర్.

విశ్వక్, శుశాంత్, అభినవ్, వెంకటేష్, అనిషా ఆంబ్రోస్ నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పెళ్లిచూపులుతో ఇండస్ట్రీని షేక్ చేసిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో కూడా మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడని చెప్పొచ్చు. యూత్ ఆలోచనలకు అద్దం పట్టేలా ఉన్న ఈనగరానికి ఏమైంది సినిమా తప్పకుండా పెళ్లిచూపులు లాంటి హిట్ అందుకుంటుందని అంటున్నారు.

ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది.. ముఖ్యంగా డైరక్టర్ ఓ కొత్త ట్రెండ్ సృష్టించేలా ఉన్నాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన ఈ ట్రైలర్ సినిమా మీద ఆసక్తిని పెంచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news