టాలీవుడ్ లో మరో విషాదం.. అసలేం జరుగుతుంది ?

editor died

ప్రముఖ ఎడిటర్ అనీల్ మల్నాడ్ (62) ఈరోజు ఉదయం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హింది సినిమాలకు ఎడిటర్ గా 200 పైగా సినిమాలకు పనిచేసిన అనీల్ మల్నాడ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. కర్ణాటకలోని చిక్ మగళూరు ప్రాంత్రానికి చెందిన అనీల్ తెలుగులో మంత్రిగారి వియ్యంకుడు సినిమాతో ఎడిటర్ గా తొలి సినిమా చేశారు.

సితార సినిమాకు నేషన్ అవార్డ్ సైతం అందుకున్న అనీల్ మల్నాడ్ బాపు దగ్గర సహాయనికుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు. బాపుతో 22 సినిమాలకు ఎడిటింగ్ చేసి తన ప్రత్యేకత చాటుకున్నారు. సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, పెళ్లి పుస్తకం, మహర్షి, సంకీర్తన, ప్యారీ బెహనా వంటి సినిమాలకు ఎడిటింగ్ చేశారు అనీల్ మల్నాడ్. 9 భాషల్లో స్టార్ సినిమాలన్నిటికి ఎడిటర్ గా పనిచేసిన అనీల్ మరణవార్త సినిమా పరిశ్రమను దిగ్బ్రాంతిలో పడేసింది.

Leave a comment