ఎన్టీఆర్ దేవిశ్రీ కి మధ్య ఎం జరిగింది? అనిరుధ్ మధ్యలో ఎందుకు వచ్చాడు?

dsp and ntr pj

వై దిస్ కొల‌వెరీ అన్నాడు హిట్
ప‌వ‌న్ సినిమాకి కంపోజ‌ర్ గా వ‌చ్చాడు హిట్
ఇలా ఏం చేసినా హిట్ టాక్ కొడుతున్నాడు అనిరుధ్
ఇప్పుడు తార‌క్‌కి సినిమాకి స్వ‌రాలు అందించే బాధ్య‌త అందుకున్నాడు
ఆ వివ‌రాలివిగో….

దేవీశ్రీ‌తో ప‌నిచేసే త్రివిక్ర‌మ్ ఆప్ష‌న్ మారిపోయింది. ఆయ‌న త‌రువాత మిక్కీతో ప‌నిచేశారాయ‌న‌. ఇప్పుడు అనిరుధ్ స్వ‌రాల‌కు ఫిదా అయ్యాడ‌త‌డు. అందుక‌నో ఇంకెందుక‌నో త్వ‌ర‌లో తార‌క్ తో తాను తీయ‌బోయే సినిమాకు అనిరుధ్‌నే స్వ‌ర‌క‌ర్త అని ఫిక్స్ అయ్యాడు. అదే మాట ఆ కుర్ర సంగీత త‌రంగం వెల్ల‌డించాడు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా తార‌క్ అభిమానుల‌కు ఈ తీపి క‌బురు అందించాడు.ప్రస్తుతం త్రివిక్రమ్‌.. పవన్‌కల్యాణ్‌ 25వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ(చినబాబు) నిర్మి స్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.ఈ సినిమా పూర్తికాగానే తార‌క్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ప‌నులు మొద‌లుకానున్నాయి.ఈ లోగా మ‌రో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ సై అంటున్నాడు. జై ల‌వ‌కుశ తో హిట్ అందుకున్న జోష్‌లో మ‌రికొన్ని వినూత్న క‌థ‌ల‌కు ఓటేసేందుకు తార‌క్ సన్న‌ద్ధ‌మ‌వుతున్నాడు.

Leave a comment