Newsడీజే 'కమ్మ' డైలాగ్ ఎందుకు వాడారో తెలుసా ?

డీజే ‘కమ్మ’ డైలాగ్ ఎందుకు వాడారో తెలుసా ?

అయితే రాజకీయ ఆరోపణలు సహజం గనుక, వీటికి ప్రాధాన్యత దక్కలేదు. కానీ తాజాగా అల్లు అర్జున్ నోట కూడా అదే ‘కమ్మ’ డైలాగ్ రావడంతో… బెజవాడ అంటే కమ్మ వారిదేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేసింది. నిజానికి ఏపీ ప్రభుత్వాన్నో లేక ఇంకొకరినో ఉద్దేశించి ఈ డైలాగ్ రాసినట్లుగా అనిపించదు, సినిమాలో ఎక్కడా అలాంటి ఛాయలు కనిపించవు.

కానీ వేరే సామాజిక వర్గానికి చెందిన హీరోగా బన్నీ నోట నుండి ఈ డైలాగ్ రావడమే చర్చనీయాంశం చేసింది. అయినా హరీష్ ఈ డైలాగ్ విషయంలో ఛాన్స్ తీసుకోకుండా ఉండాల్సింది! ఎందుకంటే బెజవాడ అంటే ‘కమ్మ’ వారు ఎలా గుర్తొస్తారో, బన్నీ సామాజిక వర్గానికి చెందిన వంగవీటి మోహన రంగా కూడా అలాగే జ్ఞప్తికి వస్తారు.

80, 90వ దశకాల్లో జరిగిన ‘కాపు వర్సెస్ కమ్మ’ సంఘటనలు దేశంలోనే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరి అలాంటి బ్యాక్ డ్రాప్ అయిన విజయవాడను ఎంచుకున్న హరీష్ శంకర్ డైలాగ్స్ విషయంలో మరింత జాగ్రత్త ఉండాలి కదా! సినిమాకు పెద్ద డ్యామేజ్ జరగదు గానీ… సిల్లీ విషయాలు కూడా సీరియస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news