‘లోఫర్’లు ఆ మెగా హీరోయిన్‌కు చుక్కలు చూపించారు!

disha patani

ఏదైనా వేడుకకు అందమైన హీరోయిన్స్ వస్తున్నారంటే చాలు.. ఇక అక్కడ కుర్రాళ్ళు గుమిగూడిపోవడం మాములు విషయమే. ఇలా ఉంటుంది తమ అభిమాన హీరోయిన్స్‌పై వారి అభిమానం. అయితే ఈ అభిమానం మితిమీరితే మాత్రం ఆ హీరోయిన్స్‌కు చుక్కలు చూపిస్తారు అదే అభిమానులు. ఇలాంటి సంఘటనలు మనం చాలానే చూశాం. గతంలో చాలా మంది హీరోయిన్స్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కోసమని వెళితే.. అక్కడ ఉన్న జనాలు వారితో ఓ రేంజులో ఆడుకునే వారు. ఇక కొందరు ఆకతాయిలు దొరికిందే ఛాన్స్ అంటూ తమ ప్రతాపం చూపించే వారు. తమకు ఇష్టమైన హీరోయిన్‌ను తాకాలనే ప్రయత్నం చేస్తారు ఆ జనాలల్లో. ఇక ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి.. కేవలం ఓపెనింగ్స్ లోనే కాదు.. హీరోయిన్ ఎక్కడ కనబడినా సరే.. అభిమానులు మాత్రం తమ పని చేసుకుంటూ వెళుతున్నారు. తాజాగా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది లోఫర్ హీరోయిన్ దిషా పఠానికి.

రీసెంట్‌గా జిమ్ నుంచి వస్తుందో లేకపోతే ఏదైనా పర్సనల్ వర్క్ మీద బయటికొచ్చిందో గానీ దిశాపఠానీని గుర్తు పట్టేసిన జనాలు వెంటనే ఆమెని రౌండప్ చేసేశారు. కొంతమంది ఆమెతో సెల్ఫీలు దిగేయడం కూడా మొదలెట్టేశారు. వాళ్లని తప్పించుకోని తన కారు దాకా రావడానికి దిషాకు చుక్కలు కనిపించేశాయ్. ఎలాగోలా ఫ్యాన్స్ తాకిడి నుంచి బయటపడి తన కారులో కూర్చుని పరుగులు పెట్టేసింది ఈ బ్యూటీ. ఏదేమైనా హీరోయిన్స్ విషయంలో ఇలాంటివి తరుచూ జరుగుతుండటంతో అభిమానులపై నిందలు వేస్తున్నాయి మీడియా ఛానల్స్. మరి ఈ విషయంపై దిషా ఏదైనా కామెంట్ చేస్తుందో లేదో చూడాలి.

Leave a comment