రాజశేఖర్ అహానికి..రానా బుక్కయ్యాడు..వాడుకున్నా….!

director teja rana rajashekar aham nene raju nene manthri

ఫ్లాపుల్లో ఉన్న తేజ సడెన్ గా ఒక్కసారి ఫాంలో ఉన్న రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీయడం అందరిని ఆశ్చర్యపరచింది. అయితే ఈ సినిమా అసలు రానా కోసం రాసుకున్న కథ కాదట.. హోరా హోరి తర్వాత తేజ డైరక్షన్ లో రాజశేఖర్ హీరోగా అహం సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైంలో డాక్టర్ రాజశేఖర్ కు తేజకు మధ్య చిన్న గొడవ జరిగిందట ఆ తర్వాత ఇద్దరు ఎవరి దారి చూసుకున్నారు.

ఇక ఆ కథనే కాస్త మార్చి రానాతో నేనే రాజు నేనే మంత్రి సినిమా తీశాడట తేజ. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు స్వయాన ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబే ఈ క్లారిటీ ఇచ్చాడు. రాజశేఖర్ అహం పూర్తిగా విలనిజంతో హీరో పాత్ర ఉంటుందట. కాని రానా ఇమేజ్ డ్యామేజ్ అవకుండా కథనం మార్చి ఈ సినిమా తీశారట.

ఆగష్టు 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అదే రోజు రిలీజ్ అవుతున్న మిగతా రెండు సినిమాల మధ్య గట్టి పోటీనే జరుగనుంది. ఇక ఎవరికి వారు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ గా తెలుగులో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్న తారక్ షోకి గెస్ట్ గా వెళ్లాడు రానా. సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్న రానా నేనే రాజు నేనే మంత్రితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Leave a comment