బాబి కార్ యాక్సిడెంట్.. కారణం ఎన్టీఆర్ పార్టీనే..!

director-babi-met-in-a-car-accident

మే 20న ఎన్.టి.ఆర్ పుట్టినరోజు సందర్భంగా తనకు పరిచయమున్న సన్నిహితులు దర్శక నిర్మాతలందరికి ఓ పార్టీ ఇచ్చాడట ఎన్.టి.ఆర్. పార్టీ అంతా సజావుగా సాగినా పార్టీ అనంతరం దర్శకుడు బాబి ప్రయాణించే కారు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కారుని ఢీ కొట్టాడట. కారులో సార్ట్ వేర్ ఎంప్లాయ్ తో పాటుగా అతని కుటుంబసభ్యులు ఉన్నారని తెలుస్తుంది.

అయితే వ్యవహారం పోలీసుల దాకా వెళ్లకుండా ఇండస్ట్రీ పెద్దలు కలుగచేసుకుని ప్రాబ్లెం సాల్వ్ చేశారని తెలుస్తుంది. స్టార్ హీరోలు, నిర్మాతలు కలుగ చేసుకుని వ్యవహారం కేసు దాకా వెళ్లకుండా చేశారట. అయితే దీనిపై ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. ఆ సార్ట్ వేర్ ఎంప్లాయ్ తరపున కుటుంబసభ్యులే ఈ న్యూస్ స్ప్రెడ్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ సంఘటనకు సంబందించిన ఎలాంటి ప్రూవ్స్ లేవని చెప్పాలి. మరి ఇది నిజంగా జరిగిందా లేక గాలి వార్త అన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment