దిల్ రాజు దెబ్బకి మేకప్ వేసుకున వినాయక్..

82

డైరక్టర్ వినాయక్ ముఖానికి మేకప్ వేసుకుంటున్నాడు. అదేంటి మోనిటర్ దగ్గర ఉండాల్సిన వినాయక్ కు మేకప్ తో పనేంటి అనుకోవచ్చు. కెమెరా వెనుక ఉండాల్సిన వినాయక్ కెమెరా ముందుకు అదేనండి నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడట. అదెలా అంటే అప్పుడప్పుడు తన సినిమాల్లో చిన్న సీన్ లో కనిపించే వినాయక్ ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించాలని చూస్తున్నాడట. వినాయక్ ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది.

దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా వస్తుందట.. అయితే ఈ సినిమాను శరభ సినిమా చేసిన ఎన్ నరసింహా రావు డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. దిల్ సినిమాతో దిల్ రాజుని నిర్మాతగా నిలబెట్టిన వినాయక్ హీరోగా అంటే కచ్చితంగా అందులో ఏదో వెరైటీ ఉంటుంది. వినాయక్ కూడా ఈ ప్రాజెక్ట్ పై గురి పెట్టుకుని ఉన్నాడట. డైరక్టర్ గా ఛాన్సులు లేవు కాబట్టి హీరోగా సత్తా చాటాలని చూస్తున్నాడు.

ఈ సినిమా హిట్టైతే మాత్రం వినాయక్ కు హీరో పాత్రలు రాకున్నా వరుస సినిమా ఛాన్సులు అయితే వస్తాయని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది. డైరక్టర్ హీరోలవడం కొత్తేమి కాదు కాని చాలా ఏళ్లుగా డైరక్టర్ గా ఉన్న వినాయక్ మొదటిసారి హీరోగా చేయడం మాత్రం ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు.

Leave a comment