ఎన్టీఆర్ పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

Dil Raju, Jr NTR

బడా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నిర్మాణంలో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రాజా ది గ్రేట్. అనీల్ రావిపుడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దీవాళి కానుకగా 18న రిలీజ్ అవనుంది. ఇక ఈ సినిమా కథ ముందు ఎనర్జిటిక్ స్టార్ రామ్.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ల దగ్గరకు వెళ్లిందట.

హైపర్ తర్వాత రామ్ ను కలిసి అనీల్ ఈ కథను వినిపించాడట. ప్రాజెక్ట్ ఫైనల్ చేసి అంతా ఓకే అనుకున్నాక ఎందుకో ఆ సినిమా నుండి రామ్ బయటకు వచ్చాడు. ఇక జై లవ కుశ కంటే ముందు అనీల్ రావిపుడి ఈ సినిమా కథను తారక్ కు వినిపించాడట. దిల్ రాజు కళ్యాణ్ రామ్ తో కలిసి ఈ సినిమా నిర్మించాలనుకున్నారట. అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

ఫైనల్ గా రాజా ది గ్రేట్ రవితేజ అయ్యాడు. గుడ్డివాడి పాత్రలో రవితేజ నటన అందరిని అవాక్కయ్యేలా చేస్తుందట. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రవితేజ నటనకు అందరు ఫిదా అవుతారని ఈ సినిమాతో మళ్లో బౌండరీ కొట్టేస్తున్నాం అన్నట్టు మాట్లాడాడు. అయితే ఈ మాటలు తన సినిమాను కాదన్న ఎన్.టి.ఆర్ కే తలుగుతాయని అంటున్నారు.

Leave a comment