ఎన్టీఆర్ సూపరే.. అరవిందకు ఏమైంది..?

12

ఎన్.టి.ఆర్, పూజా హెగ్దె జోడీగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీగా అరవింద సమేతపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలోని మొదటి సాంగ్ అనగనగనగా అరవిందట అనే సాంగ్ వచ్చింది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ లో సిరివెన్నెల సాహిత్యం అలరించింది.

అయితే ఈ సినిమా లిరికల్ వీడియోలో లీడ్ కోసం హీరో, హీరోయిన్ కలిసి చిన్న సీన్ తో మొదలు పెట్టారు. అయితే ఆ సీన్ లో ఎన్.టి.ఆర్ లుక్ అదిరిపోగా పూజా లుక్ విషయంలో డౌట్లు వస్తున్నాయి. డిజేలో బికినితో దుమ్మురేపిన పూజా సాక్ష్యంలో కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు అరవింద సమేతలో సాంగ్ లో కూడా ఏదో తేడా కొడుతుంది.

సింపుల్ గా ఉండేందుకు ఆమెకు లైట్ మేకప్ వేసినట్టు తెలుస్తుంది. అయితే సినిమాలో ఈ తేడా కొనసాగితే మాత్రం కష్టమే అంటున్నారు. మరికొందరైతే పూజా అలానే ఉంది కాని ఎన్.టి.ఆర్ ముందు తేలిపోయిందని అంటున్నారు. వరుస స్టార్స్ తో నటిస్తూ పూజా ఫుల్ ఫాంలో ఉంది.

Leave a comment