Gossipsపవన్ మాజీ భార్యను పెళ్లిచేసుకోమని ఫోర్స్ చేస్తుందెవరో తెలుసా ..?

పవన్ మాజీ భార్యను పెళ్లిచేసుకోమని ఫోర్స్ చేస్తుందెవరో తెలుసా ..?

ఈ మధ్యకాలంలో తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్న పవన్ భార్య రేణు దేశాయ్ సంచలన విషయాలు బయటపెడుతూ అందరిలోనూ ఆసక్తి రేపుతున్నారు. ఆమె చెప్పే విషయాల్లో పవన్కి సంబంధించి ఏదైనా సమాచారం ఉందేమో అని పవన్ అభిమానులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రేణుదేశాయ్ మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎన్నో ఆసక్తికర అంశాలను బయటపెట్టింది.
పవన్‌కళ్యాణ్ నుంచి 2010లో విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యతో పుణెలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరమీద పాపులర్ డ్యాన్స్‌కు జడ్జ్‌ గా వ్యవహరిస్తోన్న రేణు తాజగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన రెండో పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది.
తాను రెండో పెళ్లి చేసుకుంటానంటే పవన్ ఫ్యాన్స్ మరో పెళ్లి చేసుకోవడం కుదరదంటూ నానా రచ్చ చేసిన విషయాన్ని ఆమె మరోసారి ప్రస్తావించారు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటోన్న తనకు ఓ తోడు కావాలని, తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు తన బాధ్యతలు చూసే భర్త కావాలని రేణు తెలిపింది
.
రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిన రేణు ముందుగా ఈ విషయాన్ని పెద్దలకు చెప్పగా వారు చాలా సంతోషించారని చెప్తోంది. తాను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని,  సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ లేని వ్యక్తిని తాను పెళ్లిచేసుకుంటానంటోంది.
తనను రెండో పెళ్లి చేసుకోమని అందరూ బలవంతం పెడుతున్నారని, తనను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్న వారిలో తన కొడుకు  అకీరా కూడా ఉన్నట్టు రేణు చెప్తోంది.  ఇక తనకు రాబోయే భర్త తన ఇద్దరు పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలని. మంచి మనసున్న వ్యక్తి అయితే ఇంకా బాగుంటుందని చెప్పుకొస్తోంది. అయితే రేణు వాక్యాలకు పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. రేణు పెళ్లిపై పవన్ అభిమానుల బెదిరింపుల నేపథ్యంలో పవన్ ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news