Gossipsఆ టాప్ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు..?

ఆ టాప్ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు..?

కాస్టింగ్ కౌచ్ వివాదం కాస్త ఇప్పుడు ‘మీటూ ‘ రూపంలో అన్ని రాష్ట్రాల సినీ పరిశ్రమలను ఒక కుదుపు కుదుపుతోంది. ముఖ్యంగా ఈ ఉద్యమం బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. మొదట హాలీవుడ్ లో మొదలయిన ఈ మీటూ ఇప్పుడు ఇండియా లో కాకా రేపుతోంది. ఇటీవల మన దేశంలో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా. బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్ హార్న్ ఒకే ప్లీజ్ అనే సినిమా చిత్రీకరణ సమయంలో నాతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ నేను కూడా మీటూ బాధితురాలినే అంటూ తన బాధను సోషల్ మీడియాలో వ్యక్తం చేసింది. దీనితో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.

ఇప్పుడు ఒక్కొక్కరుగా ఈ ఉద్యమంలోకి వస్తూ తమకు జరిగిన అన్యాయాలను ప్రజాముందు ఉంచి వేధింపులకు పాల్పడిన వారి బతుకు బజారున పడేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ మీద సంచలన ఆరోపణలు వచ్చాయి. సాజిద్ మీద లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసింది.

అవి మరిచిపోకముందే అతడి మీద బాలీవుడ్ నటి దియామీర్జా తీవ్రమైన ఆరోపణలు చేసింది. అతడు తనను కూడా వేధించాడని, సెక్సువల్ వేధింపుల విషయంలో సాజిద్ చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. గతంలో సాజిద్ తో దియా ఒక సినిమా కోసం పనిచేసింది. హైదరాబాద్ కి దియా మీర్జా 2000 సంవత్సరంలో మిస్ ఆసియా ఫసిఫిక్ గా గెలుపొంది ఆ తరువాత బాలీవుడ్ లోకి ప్రవేశించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news